![]() |
![]() |

కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో నటిస్తూ షోస్ కి హోస్ట్ గా చేస్తూ, ఆలీతో సరదాగా అంటూ ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంటారు ఆలీ. ఐతే ఆలీ రీసెంట్ తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇక ఈ బర్త్ డే వీడియోని జుబేదా ఆలీ తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఆలీ ఫ్రెండ్ మోహన్ ఆలీ ఫామిలీకి వాళ్ళ ఫ్రెండ్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇక తన భర్త ఆలీ పుట్టిన రోజు సందర్భంగా జుబేదా ఆలీ చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి వెళ్లి రక్త దానం చేశారు. "రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి" అని చెప్పి చిరంజీవి అన్నయ్యకు, డాక్టర్స్ కి ధన్యవాదాలు చెప్పారు జుబేదా. సినీ, టీవీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్లంతా వచ్చి ఆలీతో కేక్ కట్ చేయించారు.
ఇక వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి అక్కడ ఆలీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఎలా వండేవారో అలా జుబేదా వండి ఆలీకి తినిపించారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్లంతా కాసేపు ఎంజాయ్ చేసి చివరికి ఇంటికి వచ్చేసారు. ఇక ఇంటికి వచ్చాక ఆలీ ఫ్రెండ్ వెంకురెడ్డి కూడా ఆయన బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఇలా ఆలీ ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ మధ్యలో బర్త్ డే ఫంక్షన్ జరిగింది.
![]() |
![]() |